telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనసూయకు “చిరు” షాక్

Anasuya-bharadwaj tollywood

కొరటాల శివ దర్శకత్వంలో నటుడు చిరంజీవి హీరోగా స్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్‌, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా చిరంజీవి 152వ చిత్రం విజయ దశమి రోజున కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఈ సెట్స్ పై వెళ్లనుంది. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహారెడ్డి” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా, డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ తనదైన శైలిలో మెసెజ్ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి ఉమెన్ హాకీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమచారం. మరోవైపు నక్సలైట్ క్యారెక్టర్‌ కూడా చేయబోతున్నట్టు చెబుతున్నారు. ఆ పాత్రలో చిరంజీవి నెరిసిన జుట్టుతో కనిపించనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో జబర్ధస్త్ అనసూయ ఒక పవర్ఫుల్ పాత్ర చేయబోతున్నట్టు గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేసాయి. ఇక చిరంజీవి కూడా అనసూయతో ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చేయించాలనుకున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో అనసూయ పాత్రకు అంత స్కోప్ లేదని చెబుతున్నారు. దీంతో ఈ సినిమాలో అనసూయ నటించడమనేది డౌటే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మొత్తానికి చిరంజీవి, కొరటాల శివ సినిమాలో అనసూయ పాత్రపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే ఈ సినిమాలో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

Related posts