క్రికెట్ అభిమానులకు శుభవార్త. మన హైదరాబాద్ మరోమారు క్రికెట్ సిరీస్ మ్యాచ్ ద్వారా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌కు త్వరలో తెరలేవబోతున్నది. సిరీస్‌లో భాగంగా వచ్చే నెల 2న జరిగే తొలి మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమివ్వబోతున్నది.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఫిబ్రవరి 11 నుంచి ఈవెంట్స్‌నౌ.కామ్(EventsNow.com) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) శనివారం పేర్కొంది. ఈనెల 24న భారత్, ఆసీస్ మధ్య విశాఖపట్నంలో తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది.