telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను రష్మిక మందన్నలా కాదు… బాలయ్య హీరోయిన్ కామెంట్

Haripriya

టాలీవుడ్ లో హీరోయిన్ హరిప్రియ తెలుగులో ‘తకిట తకిట’, నాని హీరోగా వచ్చిన ‘పిల్ల జమిందార్‌’, బాలయ్య సరసన ‘జైసింహా’లో నటించి తన అంద చందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. హరిప్రియ ప్రస్తుతం ‘ఎల్లిదే ఇల్లితనకా’ అనే కన్నడ చిత్రం చేశారు. ఈ సినిమా శుక్రవారం (ఈరోజు) ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా సినిమా ప్రమోషన్స్‌లో బీజీగా ఉన్నారు. కాగా ఈ సినిమాలో హీరో సృజన్‌ లోకేశ్‌, హరిప్రయకు మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని షూట్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ సినిమాలో కిస్ సీన్‌ను తెలుగు సినిమా ‘గీత గోవిందం’లోని కిస్ సీన్‌తో పోల్చుతున్నారు అక్కడి ప్రేక్షకులు. దీంతో ఈ విషయంపై హరిప్రియ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “గీత గోవిందం సినిమాలో రష్మిక, విజయ్‌ దేవరకొండల మధ్య అధర చుంబనం ఉండగా.. నేను నటించిన ఈ ‘ఎల్లిదే ఇల్లితనకా’ సినిమాలో ఉన్నది కేవలం మామూలు ముద్దు సీన్ మాత్రమే. నేను నటించే సినిమాలు నా ఫ్యాన్స్, ఫ్యామిలీ తో కలిసి చూసేలా జాగ్రత్త పడుతాను.. అది నా బాధ్యతగా ఫీల్ అవుతానంటోంది. అయితే కథ డిమాండ్‌ చేయబట్టే ఈ సినిమాలో ఆ ముద్దు సీన్‌లో నటించాను” అని అంటోంది ఈ ముద్దుగుమ్మ.

Related posts