telugu navyamedia
సినిమా వార్తలు

26 ఏళ్ళ పాప్ సింగర్… కానీ 68 ఏళ్ళ వ్యక్తిని పెళ్లాడబోతోంది…!?

Selena-Gomez

తొలి సారి కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కి హాజ‌రైన సెలీనా రెడ్ కార్పెట్‌పై హోయ‌లు పోయింది. ఆమె న‌టించిన “ది డెడ్‌ డోన్ట్‌ డై” సినిమాను కేన్స్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రంలో సెలీనాతో పాటు బిల్ ముర్రే ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. తొలిసారి రెడ్ కార్పెట్‌పై తాను న‌డిచిన ఫోటోని పోస్ట్ చేసింది 26 ఏళ్ళ పాప్ సింగ‌ర్ సెలీనా గోమేజ్. అంతేకాదు త్వ‌ర‌లో నా స‌హ‌న‌టుడు 68 ఏళ్ళ బిల్ ముర్రేని వివాహం చేసుకోబోతున్నాను అంటూ కామెంట్ పెట్టి అందరికీ షాకిచ్చింది. “కేన్స్‌లో తొలిసారి పాల్గొన్నా. “ది డెడ్‌ డోన్ట్‌ డై” చిత్రంలో నేనూ భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను అని పేర్కొంది. అయితే తన మాజీ ప్రియుడైన పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో సెలీనా కోపంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకుందేమో అని భావిస్తున్నారు ఆమె అభిమానులు. 26 ఏళ్ళ సెలీనా 68 ఏళ్ళ బిల్ ముర్రేని వివాహం చేసుకోబోతున్న‌ట్టు ప్రకటించడంతో ఈ విషయం కాస్తా హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts