telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తిని రేకెత్తిస్తున్న “రాహు” ట్రైలర్

Rahu

నూతన నటీనటులు.. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలలో నటిస్తున్న ‘రాహు’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేమకథలోని బలమైన ఎమోషన్స్‌ని ప్రజెంట్ చేస్తూనే అనుక్షణం ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే విధంగా కథనం సాగుతుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాహుకి ప్రధాన ఆకర్షణ. థ్రిలర్స్ తెలుగులో కొత్త ట్రెండ్‌ని సెట్ చేస్తున్నాయి. రాహు వాటి సరసన నిలబడుతుంది అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు చిత్రబృందం. తన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న సిధ్ శ్రీరామ్ పాడిన ‘‘ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా.. పాదాలూ దూరాలు మరిచాయి ఒట్టూ మేఘాల్లో ఉన్నట్టుగా.. ఏమో ఏమో ఏమో’’ పాట ‘రాహు’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిధ్ శ్రీరామ్ గానం చేసిన ఈ పాట హాంటింగ్ సాంగ్ అనిపించుకుంటోంది. రాహు శాటిలైట్, డిజిటిల్ హాక్కులు జి తెలుగు సొంతం చేసుకోవడం ఈ సినిమా పై మరింత అంచనాలను పెంచింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts