రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రజనీ సరసన మీనా, ఖుష్బూ, నయనతార నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో రజనీకి విలన్‌గా గోపిచంద్ నటిస్తున్నారని ఆ మధ్య పుకార్లు తెగ హల్‌చల్ అయ్యాయి. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్, మహేష్, నితిన్‌లకు విలన్‌గా చేసిన గోపిచంద్.. ఆ తరువాత హీరోగా బిజీ అయ్యారు. ఇక ఇప్పుడు రజనీ కోసం ఆయన మరోసారి విలన్‌గా మారినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆ వార్తలపై గోపిచంద్ స్పందించారు. అవన్నీ పుకార్లని ఆయన అన్నారు. అన్నాత్తే దర్శకుడు తెలుగులో నాతో రెండు సినిమాలను తీశారు. తరచుగా నేను, ఆయన మాట్లాడుకుంటూ ఉంటాం. మీరెప్పుడు చెబితే అప్పుడు సినిమా చేస్తాను సర్ అని శివ అంటుంటాడు. నువ్వు పెద్ద హీరోలతో చేయడం మంచిది. మనం తరువాత చూసుకుందాం అని శివకు చెప్పానని గోపిచంద్ అన్నారు. కాగా ప్రస్తుతం ఈ నటుడు సిటీమార్ సినిమాలో నటిస్తున్నాడు.
previous post
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం: రవితేజ