telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోషకాహార లేమితో బాధపడుతున్నారా?… హీరోయిన్ సెల్ఫీపై కామెంట్స్

Vani

“ఆహా కళ్యాణం” సినిమాలో శ్రుతి సుబ్రమణ్యం పాత్రతో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వాణీ కపూర్‌ యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ వారి ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’తో బాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. ఆదిత్యచోప్రా భారీ చిత్రం ‘వార్‌’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. వీటికి అభిమానుల నుంచి పాజిటివ్, నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి. తాజాగా వాణి కపూర్ ఓ సెల్ఫీని పోస్ట్ చేయగా… ఒక అభిమాని ఆమె ఫొటో చూసి ‘పోషకాహార లేమితో బాధపడుతున్నారా?‘ అని అడిగాడు. దీనికి వాణీ కపూర్ సమాధానమిస్తూ ‘మీ గురించి మీరు కొంచె మంచిపని ఏదైనా వెతుక్కోండి. ప్లీజ్ ఇతరులతో ఇలా వ్యవహరించడం తగదు. జీవితం ఎంతో గొప్పది. వ్యతిరేకించడం మానుకోండి’ అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇటీవలే వాణి కపూర్ “శ్రీరామ్” అంటూ రాసి ఉన్న డ్రెస్ ధరించడం వివాదాస్పదం కావడంతో వార్తల్లో నిలిచారు.

 

View this post on Instagram

 

🔙 to the grind ✔️

A post shared by VK (@_vaanikapoor_) on

Related posts