telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చేపల కోసం ఏకంగా రెండ్రోజుల్లో 1000 కిలోమీటర్లు… చిన్న పిల్లల సాహసం…!?

4-Children

క్వీన్స్‌లాండ్ నుంచి శనివారం రోజు నలుగురు పిల్లలు పెద్దవాడికి 14 ఏళ్లు కాగా, ఇద్దరికి 13, మరో అమ్మాయికి 10 ఏళ్ళు… తల్లిదండ్రులకు ఓ ఉత్తరం రాసి, వారి కారును దొంగలించారు. ఓ డ్రైవింగ్‌ను పంచుకుంటూ ఒక్క రెండు రోజుల్లో సుమారు 1000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో రెండుసార్లు డబ్బులు కట్టకుండా పెట్రోలు కొట్టించుకున్నారు. వెంటబడిన ఓ పోలీసు అధికారికి మస్కాకొట్టారు. వీరంతా ఒకరి తరువాత ఒకరు డ్రైవింగ్ చేస్తూ సోమవారం ఉదయానికల్లా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించారని పోలీసులు తెలిపారు. వారి కారును పోలీసులు అడ్డుకున్నప్పుడు.. కారు తలుపులన్నీ మూసేసిన వారు కిందకు దిగడానికి నిరాకరించారు. అప్పుడు కారు కిటికీ అద్దం పగలగొట్టిన పోలీసులు వారిని బయటకు లాగారు. పిల్లలకేమైందో అనే భయంతో కారు దొంగతనం జరిగిందని కేసు పెట్టిన తల్లిదండ్రులు.. పిల్లలంతా క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. తల్లిదండ్రులు లేకుండా పిల్లలను ప్రశ్నించకూడదనే చట్టం అమల్లో ఉండటంతో.. పిల్లల తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన పోలీసులు వారి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ పిల్లలు ఇదంతా చేసింది చేపలు పట్టడం కోసమేనట!!

Related posts