telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రీమ్ గ‌ర్ల్‌ : రాధే రాధే వీడియో సాంగ్

Dream-Girl

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, గ్లామ‌ర్ బ్యూటీ నుష్ర‌త్ బరుచా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ్ షాండిల్య తెర‌కెక్కించిన చిత్రం “డ్రీమ్ గ‌ర్ల్‌”. కామిడీ క‌థా నేప‌థ్యంతో రూపొందిన‌ ఈ సినిమా ఆయుష్మాన్‌కు పెద్ద హిట్ ఇచ్చింది. కాల్ సెంట‌ర్‌లో ప‌నిచేస్తున్న హీరో… ఆడ గొంతుతో క‌స్ట‌మ‌ర్ల‌కు కిక్ ఎక్కిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశాడు. చిత్రంలో సాంగ్స్ కూడా ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టున్నాయి. తాజాగా చిత్రం నుండి రాధే రాధే సాంగ్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అలరిస్తుంది. గత ఏడాది అందాధున్‌, బ‌దాయి హోల‌తో హిట్ కొట్టిన ఆయుష్మాన్ ఈ ఏడాది కూడా ఆర్టిక‌ల్ 15తో ఊపుమీద క‌నిపించాడు. ఇక ఇప్పుడు డ్రీమ్‌గ‌ర్ల్ అత‌ని స్టార్‌డ‌మ్‌ను మ‌రింత పెంచింది.

Related posts