telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మంచు మనోజ్ మూవీలో మెగా హీరో !

హీరో మంచు మనోజ్ మూడేళ్ళ తరువాత ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అహం బ్రహ్మస్మి అనే సినిమాలో నటిస్తున్నాడు మంచు మనోజ్. ‘అహం బ్రహ్మస్మి’ అనే ఓ పవర్ ఫుల్ టైటిల్‌తో కొత్త సినిమా చేస్తున్నారు. ’అహం బ్రహ్మ అస్మి’ అంటే నేనే బ్రహ్మను అంటే నాలోనే ‘బ్రహ్మ’ ఉన్నాడని అర్థం. ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.  ఇప్పుడు చిత్రీకరణకు రెడీ అవుతోంది. అయితే ఇందులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అతిథి పాత్ర అయినా కథను మలుపు తిప్పేలా ఉంటుందట. నిజానికి సాయిధరమ్, మనోజ్ మంచి స్నేహితులు. అందుకే మనోజ్ అడగ్గానే సాయి ధరమ్ వెంటనే ఓకే చెప్పాడట. తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త వారిని ప్రోత్సహిస్తానని మనోజ్ చెప్పినట్లుగానే ఈ సినిమా ద్వారా పలువురు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాడట. మరి గ్యాప్ తీసుకుని మనోజ్ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎంత వరకూ సఫలీకృతుడు అవుతాడో చూడాలి.

Related posts