telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గుడ్‌ న్యూస్‌ : మళ్లీ పడిపోయిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ తగ్గు ముఖం పట్టాయి. గత ఐదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ. 50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. అయితే… తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి రోజున బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. ఈరోజు భారీగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 370 తగ్గడంతో రూ. 51, 440 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 47, 150 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గడంతో రూ. 49,090 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గడంతో రూ. 45, 000 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే ధరలో ఎలాంటి మార్పు జరగలేదు. హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 64,700 నడుస్తోంది.

Related posts