telugu navyamedia
క్రీడలు వార్తలు

నెగిటివ్‌ వచ్చిన కరోనా లక్షణాలు పోలేదు : వరుణ్‌ చక్రవర్తి

కరోనా నెగిటివ్‌ వచ్చినా ఇంకా ఆ లక్షణాలు పోలేదని.. అప్పుడప్పుడు రుచీ, వాసన కోల్పోతున్నా అని చెప్పాడు వరుణ్‌ చక్రవర్తి. అయితే వరుణ్‌, సందీప్‌ వారియర్‌ కరోనా బారిన పడిన తర్వాతే ఐపీఎల్ 2021 బయో బుడగలో ఉన్న ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. పలు జట్లలో వైరస్ కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని నిరవధిక వాయిదా వేసింది. తాజాగా వరుణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ… ‘ప్రస్తుతం నేను ఇంట్లో ఉంటూ కోలుకుంటున్నా. శారీరకంగా బలహీనంగా ఉండటంతో ప్రాక్టీస్‌ చేయడం లేదు. కరోనా నెగిటివ్‌ వచ్చినా ఇంకా ఆ లక్షణాలు పోలేదు. అప్పుడప్పుడు రుచీ, వాసన కోల్పోతున్నా. కానీ త్వరలోనే ట్రైనింగ్‌ ప్రారంభిస్తా’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2021 జరుగుతున్న సమయంలో వైరస్ బారిన పడిన కోల్‌కతా బౌలర్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ 10 రోజుల ఐసోలేషన్‌ పూర్తి చేసుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. సందీప్‌ వైరస్ నుంచి త్వరగానే బయటపడినా.. వరుణ్‌కి మాత్రం కాస్త సమయం పట్టింది. వైరస్‌ బాధితులకు వరుణ్‌ చక్రవర్తి పలు సూచనలు చేశాడు. ‘కరోనా నుంచి కోలుకున్నా.. కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. అది క్రీడాకారులైనా, మరెవరైనా కావచ్చు. మీకు నెగిటివ్‌ వచ్చినా కచ్చితంగా మాస్క్‌ ధరించండి. అది మీ చుట్టూ ఉండేవాళ్లకు రక్షణగా ఉంటుంది. అలాగే వైరస్‌ బారిన పడినప్పుడు దేని గురించీ ఆలోచించొద్దు. అనవసర విషయాలు అసలు పట్టించుకోకపోవడం మంచిది. ముఖ్యంగా బయటి విషయాలను ఏమాత్రం పట్టించుకోవద్దు’ అని వరుణ్‌ సూచించాడు.

Related posts