మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 90 శాతంపైగా మున్సిపాల్టీలను వైసీపీ దక్కించుకుంది. తాజాగా గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం వైసీపీ కైవసం చేసుకుంది. ఇది ఇలా ఉండగా… ఈ మున్సిపల్ ఎన్నికలపై తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి టీడీపీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీని చంద్రబాబు భ్రష్టుపట్టించారని ఫైర్ అయ్యారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిందని ఆమె పేర్కొన్నారు. ఇక చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ కలిసి పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఇంకా 30 ఏళ్ల పాటు జగన్ పరిపాలన కొనసాగుతుందని లక్ష్మిపార్వతి ధీమా వ్యక్తం చేశారు.