telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేడు టీటీడీ పాలక మండలి సమావేశంలో 85 అంశాలపై చర్చ..

తిరుమల : ఇవాళ సమావేశంలో 85 అంశాలు పై చర్చించనుంది టీటీడీ పాలకమండలి. టెబుల్ అజేండగా మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది.
శ్రీవారి ఆలయంలో దర్శనాలు పెంపు పై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి.. గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడ చేయనుంది.
వరాహస్వామి ఆలయ గర్బాలయ వాకిలికి దాత సహాయంతో 180 కేజిల వెండితో తాపడం పనులు…
తిరుపతి ఆలయంలో పుష్పకైంకర్యానికి వినియోగించే పుష్పాలతో అగరబత్తులు తయ్యారికి ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తిరుమలలో మూడో దశలో 1389 సిసి కెమెరాలు ఏర్పాటుకు టెండర్లు ఖరారు చేయనుంది.
ధార్మిక ప్రచారంలో భాగంగా కళ్యాణమస్తూ,ఎస్సి ఎస్టి బిసి కాలనీలో 500 ఆలయాలు నిర్మాణం త్వరలోనే ప్రారంభించే అవకాశం వుంది.హౌసింగ్ సొసైటీ నిబంధనల మేరకు ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపులు..హిందూ దేవాలయాలకు ఇచ్చే విగ్రహాలు కేటాయింపు సబ్సిడీ 3లక్షలకు తగ్గించాలని నిర్ణయం తీసుకోనుంది.టీటీడీ విద్యాసంస్థలలో చదువుకునే హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా ఆహారం పంపిణీ…టీటీడీ అస్పత్రులలో మందులు కొనుగోళ్లపై కూడ నిర్ణయం తీసుకోనుంది.టీటీడీలోని పలు విభాగాలలో తాత్కాలిక పోస్టులను శాశ్వత పోస్టులుగా గుర్తించాలని నిర్ణయం. ఏటీసీ,వరాహస్వామి అతిధి గృహం,ఉద్యోగుల కాటేజీలు ఆధునికరణ.. కాకులమాను కొండ వద్ద వున్న విండ్ పవర్ ను 10ఏళ్ళు పాటు ఉచితంగా మైంటైన్స్ కు గ్రీంకో ఎనరజిస్ కు కేటాయింపులు చేయనుంది….

Related posts