మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణలపై విచారణ మొదలైంది. అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కు చేరుకున్నారు ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు. అలాగే అచ్చంపేట గ్రామ పరిధిలో భారీ పోలీసు బలగాలు మోహరించాయి. ఒకవైపు బాధితుల నుంచి సమాచారం తీసుకుంటూనే, మరోవైపు క్షేత్ర స్థాయిలో డిజిటల్ సర్వే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఏడుగురు ఫిర్యాదు చేసినప్పటికీ.. మరింత మంది బాధితులు నుంచి ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. భారీ బందోబస్తుతో రెవిన్యూ, ఎసిబి, విజిలెన్స్ అధికారులు విచారం చేస్తున్నారు. అటు మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్ సహా హుజూరాబాద్ నియోజక వర్గంలో అడుగడుగునా భారీగా మోహరించారు పోలీసులు. ఈటల రాజేందర్ పై వేటువేసే ఉద్దేశ్యంతోనే పోలీస్ లు మోహరించారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈటెల అభిమానులు. ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. ఈటలకు అన్యాయం జరిగితే చూస్తూ సహించేది లేదంటున్నారు అభిమానులు
previous post