telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పాక్ కోరితే వ్యాక్సిన్ ను పంపిస్తాం : భారత్

corona vaccine covid-19

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశం తో పాటుగా మన శత్రుదేశం అయిన పాకిస్థాన్ లో కూడా తెగ పాకింది. అయితే ఇండియాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.  ఈనెల 16 వ తేదీ నుంచి వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.  జనవరి 20 వ తేదీ నుంచి చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా వ్యాక్సిన్ ను పంపిస్తోంది ఇండియా.  నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ ఇలా అనేక దేశాలకు ఇండియా నుంచి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నది.  శ్రీలంక, మారిషస్ దేశాలకు కూడా వ్యాక్సిన్ ను త్వరలోనే పంపించబోతున్నారు.  అయితే, పక్కనే ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ కు ఇండియా నుంచి వ్యాక్సిన్ పంపుతారా లేదా అన్నది ప్రస్నార్ధకంగా మారింది. పాకిస్తాన్ నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ పాక్ కోరితే వ్యాక్సిన్ ను పంపిస్తామని, శత్రుదేశంగా చూడకుండా, మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలతో సమానంగా పాక్ ను కూడా చూస్తామని, భారత విదేశాంగ శాఖ తెలిపింది.  పాక్ కు చైనా అత్యంత మిత్రదేశం.  చైనా నుంచి ఇప్పటికే పాక్ కు వ్యాక్సిన్లు సరఫరా అయ్యాయి.  అయితే, చైనా తయారు చేసిన వ్యాక్సిన్లపై ప్రపంచానికి పెద్దగా నమ్మకం కుదరలేదు.  చైనా వ్యాక్సిన్ వలన ఎలాంటి ఉపయోగం లేదని ఇప్పటికే బ్రెజిల్ ప్రకటించింది.  బ్రెజిల్ కు ఇండియా నుంచి 20 లక్షల డోసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్లు త్వరలోనే సరఫరా కాబోతున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి పాక్ మన సహాయాన్ని కోరుతుందా… లేదా అనేది.

Related posts