telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పునర్నవి హీరోయిన్ గా “సైకిల్”… లిరికల్ వీడియో సాంగ్ విడుదల

Cycle

బిగ్ బాస్ సీజ‌న్3 ఫేం పున‌ర్న‌వి భూపాలం న‌టిస్తున్న తాజా చిత్రం “సైకిల్‌”. మ‌హ‌త్ రాఘ‌వేంద్ర‌, శ్వేతా వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆట్ల అర్జున్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. సుద‌ర్శ‌న్‌, అనితాచౌద‌రి, సూర్య‌, మ‌ధుమ‌ణి ,ఆర్ఎక్స్‌100 ల‌క్ష్మ‌ణ్‌, అన్న‌పూర్ణ‌మ్మ, జోగీబ్ర‌ద‌ర్స్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. కామెడీ జోన‌ర్ సినిమాకి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ మ్యాజిక్ యాడ్ ఐతే, ఎంత కొత్త‌గా వుంటుందో, సైకిల్ చిత్రం అలానే ఉంటుందని మేక‌ర్స్ అంటున్నారు. సతీశ్‌ మ్యూజిక్‌డైరెక్టర్‌. ప్రేమకథ నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. కమెడియన్‌ సుదర్శన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుదల కాగా, తాజాగా ప్రేమ‌.. అంటూ సాగే లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు. చిన్మ‌యి శ్రీ పాద ఆల‌పించిన సాంగ్ సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది.

Related posts