telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

హవాలా మార్గంలో ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం…

ఉగ్రవాదులకు స్వచ్ఛంద సంస్ధల ముసుగులో అలాగే హవాలా మార్గంలో టెర్రరిస్టులకు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్ లోని ఎన్జీవో కార్యాలయాలపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దాడులు కలకలం రేపుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు పోరుగుదేశం నుంచే కాదు స్థానికంగానూ కొన్ని స్వచ్ఛంద సేవా సంస్ధల నుంచి అండదండలు లభిస్తున్నాయి. ఎన్.ఐ.ఎ నిర్వహించిన దాడుల్లో ఈ నిజాలు వెలుగు చూశాయి.  శ్రీనగర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో, బాందీపురలోని ఒక చోట, బెంగళూరులోనూ ఏకకాలంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఎన్జీవో కార్యాలయాలపై ఈ దాడులు నిర్వహించారు.  అక్కడి ఎన్జీవోల నుంచి  ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందుతోందని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎన్‌ఐఏ దాడులు చర్చనీయాంశంగా మారాయి. హవాలా రాకెట్, నిధుల దుర్వినియోగం, ఉగ్రవాదులకు నిధులు అందించారనే  సమాచారంతో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దాడులు చేసింది.  గ్రేటర్ కశ్మీర్ న్యూస్ పేపర్ కార్యాలయంతోపాటు,   మానవహక్కుల యాక్టివిస్టు ఖుర్రం పర్వేజ్ ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు  చేశారు. 2016లో శ్రీనగర్ లో ఖుర్రం పర్వేజ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్టుచేశారు. అప్పట్లో 76 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న ఖుర్రంను కోర్టు ఉత్తర్వులతో పబ్లిక్ సేఫ్టీ కింద మరోసారి జైలుకి పంపారు.  

Related posts