telugu navyamedia
రాజకీయ వార్తలు

వ్యవసాయ బిల్లుపై కాంగ్రెస్ కొత్త వ్యూహం!

soniya rahul

రాజ్యసభలో వివాదాస్పద వ్యవసాయ నియంత్రణ బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేయాల్సి వుండగా, ఆపై ఇవి చట్టరూపం దాల్చి అమల్లోకి రానున్నాయి. ఈలోగానే దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.

ఈ బిల్లును పలు విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా నేపథ్యంలో కాంగ్రెస్ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది.ఇందుకు పలు విపక్ష పార్టీలతో పాటు, అధికార ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ ను కూడా తోడు తీసుకోవాలని భావిస్తోంది.

 ఉత్తర భారతావనిలో ఇప్పటికే కొనసాగుతున్న రైతు నిరసనలను, దక్షిణాదికి కూడా తీసుకెళ్లి, దేశవ్యాప్తంగా ఉద్యమానికి తెరలేపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకు తన అనుబంధ బీకేయూ (భారతీయ కిసాన్ యూనియన్)ను వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక గురువారం నుంచి ఈ నిరసనలను దేశవ్యాప్తం చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది.

Related posts