telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రికీ పాంటింగ్ .. సలహాలూ ఇస్తున్నాడట…

rikey pointing on warner batting in ashes series

ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ భారీ స్కోరు సాధించడంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ విఫలమవుతున్నాడని అన్నాడు. వార్నర్‌ యాషెస్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. భారీ స్కోరు సాధించే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇది అతడిని నిరాశకు గురిచేసే అంశం. దూరంగా వెళ్తున్న బంతుల్ని అతడు కట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బంతిని పూర్తిగా అంచనా వేయడంలో విఫలమవ్వడంతో అది ఎడ్జ్‌ తీసుకుంటుంది. దీంతో బంతి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌కు చేరుతుంది. షార్ట్‌ అండ్‌ వైడ్‌ బంతుల్ని అతడు పూర్తి విశ్వాసంతో ఎదుర్కోవాలి. బంతిని బలంగా బాదడానికి ప్రయత్నించాలి. ఒత్తిడికి లోనవ్వకుండా బంతిని అంచనా వేస్తూ బ్యాటింగ్‌ చేయాలి.. అని రికీ పేర్కొన్నాడు.

ఏడాది పాటు బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ నిషేధానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరగుతున్న యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌, వార్నర్‌ టెస్టు క్రికెట్‌లో తిరిగి పునరాగమనం చేశారు. తొలి టెస్టులో స్మిత్‌ 144, 142 పరుగులతో అదరగొట్టాగా వార్నర్‌ (2, 8) మాత్రం రెండంకెల స్కోరు కూడా అందుకోలేకపోయాడు. రెండో టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లోనూ వార్నర్‌ 3 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ యాషెస్‌లో వార్నర్‌ మూడు సార్లు స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లోనే ఔటవ్వడం జరిగింది.

Related posts