telugu navyamedia
Uncategorized

తెలంగాణ‌లో కొత్తగా 2,166 కోవిడ్ కేసులు

Corona

తెలంగాణలో క‌రోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దూసుకుపోతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,166 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో మృతి చెందగా, 2,143 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,774 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,44,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,052కు చేరింది. ప్రస్తుతం 29,649 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 309 మంది కోవిడ్ బారినపడ్డారు.

Related posts