telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యాజమాన్యం మా మాటల్ని పట్టించుకోలేదు: అశ్వత్థామరెడ్డి

ashwathama reddy

ఆర్టీసీ జేఏసీ నేతలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కోర్టు ఉత్తర్వులు అమలు చేశామని చెప్పడానికే చర్చలు పెట్టారని, సమస్యల పరిష్కారం కోసం కాదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సమస్య పరిష్కరించే ఉద్దేశ్యం లేదని అన్నారు.

మా మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు. కేవలం నలుగురిని మాత్రమే చర్చలకు ఆహ్వానించారు. కోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ 21 డిమాండ్లపై మాత్రమే యాజమాన్యం చర్చిస్తామంటోందని తెలిపారు. పూర్తి డిమాండ్లపై చర్చలు జరపాలని మేము పట్టుబట్టాం. 26 డిమాండ్లపై చర్చలు జరిపాలని అన్నాం. యాజమాన్యం మా మాటల్ని పట్టించుకోలేదు. అందుకే బయటికి వచ్చేశాం. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం. మా డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

Related posts