telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

చెక్ నుండి విడుదల కానున్న పాట…

ప్రస్తుతం తెలుగు హీరోలు అందరూ వరుస సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా ఈ ఏడాది వరుస సినిమాలను ఓకే చేసి మంచి జోరుమీదున్నారు. ప్రస్తుతం నితిన్, కీర్తీ సురేష్‌లు జంటగా రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వెంకీ అల్లూరీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత ప్రారంభించిన చెక్ సినిమా ఈ నెల 26న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే తాజాగా ఈరోజు ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్‌ను ఇచ్చారు. చెక్ లిరికల్ పాటను ఈరోజు మధ్యహ్నం 2 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను’ అంటూ సాగనున్న పాట రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట ప్రియా ప్రకాష్ వారియర్, నితిన్ ఇద్దరి మధ్య చోటుచేసుకోనున్నట్లు అర్థం అవుతోంది. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ పాట… సినిమా అభిమానులను అంత ఆకట్టుకుంటాయి అనేది.

Related posts