telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

స్ట్రీట్ లైట్ ఫిర్యాదులను రెండు రోజుల్లో పరిష్కరించాలి – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

 స్ట్రీట్ లైట్ ఫిర్యాదులను రెండు రోజుల్లోనే పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో విద్యుత్ విభాగం అధికారులు, ఈఈయస్ఎల్  ఏజేన్సీ తో పాటు కమిషనర్ రోనాల్డ్ రోస్ తో కలిసి మేయర్ వీధి దీపాల నిర్వహణ పై శుక్రవారం  సమీక్షించారు.

ఈ  సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…  గత సమావేశం   సంబంధిత ఏజెన్సీ వచ్చిన ఫిర్యాదుల ప్రకారంగా వెనువెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని కానీ ఇచ్చిన హామీ ప్రకారం గా బఫర్ స్టాక్  సిద్ధంగా లేకపోవడం మూలంగా ఫిర్యాదుల పరిష్కారం కావడం లేదని అందువల్ల ప్రజలు, కార్పొరేటర్ నుండి అనేక ఆరోపణలు పిర్యాదులు  వస్తున్నాయని మేయర్  తెలిపారు. ఇక నైనా పనితీరును మార్చుకోకపోతే  ఇబ్బంది పడతారని  ఏజెన్సీని హెచ్చరించారు.

ఏజెన్సీ కి నెల నెల చార్జీలు చెల్లిస్తున్న  అట్టి మొత్తం జిహెచ్ఎంసి కే ఖర్చు చేయాల్సి ఉండగా  రాష్ట్రంలో ఇతర  మున్సిపాలిటీలకు నిధులను మల్లించడం వలన  నగరంలో అవసరమైన బఫర స్టాక్ సిద్ధంగా పెట్టడంలేదని అందువలన  ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కారం చేయలేక పోతున్నారని  మేయర్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు పగలు వెలుగుతున్నాయి, రాత్రి పూట వెలగడం లేదని ఇలాంటి ఆరోపణలు నగర వ్యాప్తంగా వస్తున్నాయన్నారు.  బఫ్ఫర్ స్టాక్  ఉన్న ప్రకారంగా  ముందుగా ఫిర్యాదుల  పరిష్కారం చేయాలని అన్నారు. ఒప్పందం ప్రకారం గా బప్పర్ స్టాక్  నిర్వహణ చేయలేకపోవడం మూలంగా  ఫిర్యాదులు పరిష్కారం సకాలం లో  జరగడం లేదన్నారు. అంతేకాకుండా బప్పర్ స్టాక్ ఉన్న  ఫిర్యాదులు పరిష్కారం జరగడం లేదన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న బఫర్ స్టాక్  రెండు రోజుల్లో   పూర్తి చేయాలన్నారు. అందుకు రోజు వారీగా ఎన్ని వీధిలైట్లు అమర్చారో సాయంత్రం వరకు  పూర్తి నివేదిక ను అందజేయాలని ఎలక్ట్రిసిటీ ఎస్ఈ  శ్రీనివాస్ ను  ఆదేశించారు.
అదే విధంగా జోనల్ కమిషనర్ లు కూడా  పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
మేయర్ గారు సూచించిన విధంగా సంబంధిత కార్పొరేటర్ లకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇ ఎన్ సి జియా ఉద్దీన్ , ఎస్ సి  శ్రీనివాస్, జోనల్ కమిషనర్ లు మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, వెంకన్న,   ఎలక్ట్రిసిటీ ఈ ఈ మమత, డిప్యూటీ ఈ ఈ,  ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts