ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యాధి మరింత ముదరడంతో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. బైపోలర్ డిజార్డర్‌తో సునైనా బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. నేపధ్యంలో రోషన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కాగా 2018లో సునైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. కాగా బైపోలర్ డిజార్డర్‌తో బాధపడుతున్నవారు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంటారు. నిరాశతో కుమిలిపోతారు. ఉన్మాదులుగా ప్రవర్తించడం కూడా జరుగుతుంటుంది.
next post