telugu navyamedia
సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ తో తెలుగు హీరోయిన్ నిశ్చితార్థం

Richa gangopadhyaya Engaged with Boy Friend
ప్రముఖ నటి రిచా గంగోపాధ్యాయ తన నిశ్చితార్థం జరిగిపోయినట్టు స్వయంగా వెల్లడించారు. రెండేళ్లుగా తాను ప్రేమిస్తున్న జోయ్ అనే వ్యక్తితో తాను నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలిపింది రిచా గంగోపాధ్యాయ. తాను చదువుకున్న బిజినెస్ స్కూల్ లో రెండేళ్ల క్రితం జోయ్ తో పరిచయం అయ్యిందని, పెళ్ళి తేదీని ఇంకా నిర్ణయించుకోలేదని తెలుపుతూ సోషల్ మీడియాలో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

రానాతో లీడర్, రవితేజతో మిరపకాయ్, వెంకటేష్ తో నాగవల్లి, రవితేజతో సారొచ్చారు, ప్రభాస్ తో మిర్చి, నాగార్జునతో భాయ్ తదితర చిత్రాల్లో రిచా గంగోపాధ్యాయ నటించిన విషయం తెలిసిందే.

Related posts