telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ తో భారీ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్న బాలీవుడ్ నిర్మాత ?

Prabhas

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు రాధా కృష్ణతో చేస్తున్న “రాధే శ్యామ్” మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిన ప్రభాస్ 21మూవీ స్కేల్ ఆయన గత చిత్రాలకు మించి ఉన్నట్టు తెలుస్తుంది. యూనివర్సల్ అప్పీల్ కోసం ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనెను తీసుకున్నారు. ఈ చిత్రం తరువాత ప్రభాస్ ఓ డైరెక్ట్ హిందీ మూవీ చేయనున్నారట. ప్రభాస్ సాహో, రాదే శ్యామ్ హిందీ వర్షన్స్ విడుదల హక్కులు దక్కించుకున్న టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నారట. ఇక ఈ చిత్రం ఓ మైథలాజిల్ మూవీ అని తెలుస్తుండగా, డైరెక్ట్ హిందీలో తెరకెక్కి తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుందని సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తుంది.

Related posts