telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నందమూరి నాలుగో తరానికి డోకా లేదు… బండ్ల గణేష్ ట్వీట్

ntr

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అగ్రకథనాయకుడిగా ఓ వెలుగు వెలుగుతూ తాతకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటున్నాడు. ఇక రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. 2009 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున తారక్ ప్రచారం చేశాడు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా ఓ వైపు సినిమాలు… మరో వైపు రాజకీయాలు చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య ఉన్నారు. దీంతో నందమూరి ఫ్యామిలీకి ఏ రంగంలో కూడా తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు నాలుగోతరానికి కూడా ఏ మాత్రం ఢోకా లేదని చెబుతున్నాడు ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్. నందమూరి నాలుగో తరానికి డోకా లేదని హోలీ సందర్భంగా తెలియజేసిన మా యంగ్ టైగర్ కి శుభాకాంక్షలు బండ్ల గణేష్⁦@tarak9999⁩. తాజాగా తారక్ తన ఫ్యామిలీకి సంబంధించిన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భార్య, ఇద్దరు కొడుకులతో కలిసిన ఫోటోను ఆయన హోలీ సందర్భంగా అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఈ ఫోటోను చూసిన బండ్ల గణేష్… నందమూరి నాలగో తరానికి ఢోకా లేదని హోలీ సందర్భంగా మా యంగ్ టైగర్ తెలియజేశాడన్నారు. తారక్‌కు ఆయన హోలీ విషెస్ కూడా చెప్పాడు. మరోవైపు బండ్ల ట్వీట్‌తో ఎన్టీఆర్ అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు.

Related posts