telugu navyamedia
సినిమా వార్తలు

‘అఖండ’ విజయం..అభిమానులకు పూనకాలు

టాలీవుడ్ టాప్ స్టార్, యువరత్న నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో విశ్వరూపాన్ని ప్రదర్శించి అభిమానులకు పూనకాలు తెప్పించారు. క్రేజీ కాంబినేషన్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన అఖండ సినిమా విడుదలైన థియేటర్లలో అభిమానుల సందడి, తొలిఆట తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ సినిమా యూనిట్ ను ఉత్సాహపరచింది. కోవిడ్ పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని సినీప్రముఖుల్లో కొత్తజోష్ నింపింది.

Akhanda Movie Release: Balakrishna's 'Akhanda' gearing up to do the Violent  Yagnam in theaters from tomorrow!

సింహా, లెజెండ్ సినిమాల తర్వాత అందరూ ఊహించనట్లే బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుని హ్యాట్రిక్ సాధించారు. చాలారోజుల తర్వాత బాలకృష్ణను విభిన్న షేడ్లలో పాత్రల్లో లీనమైన తీరు అభిమానుల్ని… ఆనందసాగరంలో ముంచెత్తిందని చెప్పొచ్చు. మురళీకృష్ణగా బాలకృష్ణ, గ్రామీణనేపథ్యంలో రైతుగా… సంఘసంస్కర్తగా స్కూళ్లు కట్టివ్వడం, ఆస్పత్రుల్ని నిర్వహించడం వంటి సామాజిక సేవలతో సమాజాన్ని ఉద్ధరించే తీరు అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది.

Akhanda Movie Review: Strictly for Balakrishna's fans

ప్రజాసేవకుడైన బాలకృష్ణను , కలెక్టర్ గా వచ్చిన ప్రగ్యాజైశ్వాల్ ప్రేమలో పడటం, పెళ్లిచేసుకోవడం ఆసక్తిరేకెత్తిస్తూ సాగిన సినిమాలో… మైనింగ్ మాఫియా ముసుగులో యురేనియం తవ్వకాలతో ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని పాడుచేయడం, మాఫియా ఆటకట్టించే తీరు… అభిమాన ప్రేక్షకులకు గగుర్పొడిచే సన్నివేశాలు థియేటర్లలో ఈలలేయించాయి.

I feel intimated by Balayya.. says Pragya - More secrets on Akhanda event?

అఖండ సినిమా చూసిన ప్రేక్షకులనుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా ఉందని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరో నందమూరి బాలకృష్ణతోపాటు, సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, సినీనిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి, సినిమా యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Akhanda Release Date: Did 'Akhanda' already make 57 crore even before  announcement of release date?

సినిమా విడుదలైన తెలుగు రాష్ట్రాల్లోనే గాకుండా… పొరుగున ఉన్న కర్ణాటక, అమెరికాలోనూ అఖండ సినిమా పట్ల పాజిటివ్ టాక్ సినిమా యూనిట్లో ఆనందోత్సాహాన్ని రెట్టింపు చేసింది. అఖండ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

బాలకృష్ణ అభిమానుల అరుపులు, కేకలు, పూనకాలతో ఊగిపోయారు. తమ అభిమాన హీరో అఘోరా పాత్రలో కన్పించగానే… కర్పూరహారతులివ్వడం థియేటర్ల సందడికి వన్నెతెచ్చింది. సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణను అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మలిచిన తీరు, ఆ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్, తమన్ నేపథ్య సంగీతం మాస్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Related posts