telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా అఫైర్స్ పై మిహీకా రియాక్షన్…!

ప్రస్తుతం రానా దగ్గుబాటి నటిస్తోన్న ‘విరాటపర్వం’ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాదు వీటితో పాటు బాబాయ్‌ వెంకటేష్‌తో కలిసి మరో సినిమాలో నటించేందుకు రానా ఓకే చెప్పారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా తాజాగా తనపై వచ్చిన గాసిప్స్ గురించి, వారిపై తన భార్య మిహికా రియాక్షన్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో రానా దగ్గుబాటి గురించి అనేక రూమర్స్ వచ్చాయి. నటి త్రిషతో రానా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై రానా ఎప్పుడూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా ఈ గాసిప్స్ పై తన భార్య మిహీకా ఎలా రియాక్ట్ అయిందన్న దానిపై రానా క్లారిటీ ఇచ్చారు. ”నా మీద మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. వాటిలో అఫైర్స్‌ గురించే ఎక్కువగా ఉన్నాయి. మిహీకా.. హైదరాబాద్‌, ముంబైలలో పెరిగిన అమ్మాయి. తనకు గ్లామర్ ఫీల్డ్‌ గురించి బాగా తెలుసు అందుకే ఇలాంటి వార్తలను తను లైట్‌ తీసుకుంది” అని రానా చెప్పారు. కేవలం అఫైర్స్ గురించే కాదు.. హెల్త్‌ గురించి వచ్చిన రూమర్స్‌ ను కూడా మిహీకా పట్టించుకోలేదని రానా చెప్పుకొచ్చారు.

Related posts