telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా “ఆర్ఆర్ఆర్” స్పెషల్ వీడియో

RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రూపొందుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. ఇంకా కొన్ని రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలివుంది. లాక్ డౌన్ ఎత్తేయగానే మిగతా షూటింగు మొదలుకానుంది. ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదిలారు. ఆ వీడియోకు అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియో పలకరించనుంది. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదలనున్నారు. ఇప్పటికే వీడియోను సిద్ధం చేశారట. టీమ్ అంతా కూడా ఈ వీడియో పట్ల సంతృప్తికరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ వీడియో ఉంటుందని అంటున్నారు. ముందుగా చెప్పిన ప్రకారమే జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Related posts