ఈ మధ్య తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ మాట్లాడిన ఆడియో టేప్ అంటూ.. ఓ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోన్ ట్యాపింగ్‌కు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మమతా బెనర్జీ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్టు వెల్లడించింది. అయితే కూచ్‌బేహార్ కాల్పుల్లో చనిపోయిన వారి మృతదేహాలతో ర్యాలీ నిర్వహించండి అంటూ సీఎం మమత బెనర్జీ.. చెబుతున్నట్టు ఓ ఆడియో బయటికి వచ్చింది.. ఆ తర్వాతే రోజే దీదీ ఇలా స్పందించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇవాళ గాల్సీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా తాము చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోలేక.. భారతీయ జనతా పార్టీ ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలు.. ప్రతిరోజూ మేం మాట్లాడుకునే సంభాషణలను కూడా చోరీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మమతా.
previous post
next post
అక్రమ కేసులతో కేసీఆర్ భయపెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి