telugu navyamedia
సినిమా వార్తలు

‘శేఖర్’లో శివానీ రాజశేఖర్…‌

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన సినిమా 91వ ‘శేఖర్’. ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కుమార్తె పాత్రలో కనిపించనున్నారు. వెండితెరపై తండ్రితో క‌లిసి శీవానీ క‌నిపించ‌నున్న మొద‌టి చిత్ర‌మిదే.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్, ఫ‌స్ట్ గ్లింప్స్‌, సాంగ్‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేశారు చిత్ర‌యూనిట్‌. 

జీవితా రాజశేఖర్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే వ‌హిస్తున్నారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది.

Rajashekar as Shekar, a first glimpse | Telugu Cinema

“రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో… సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా న‌టించార‌ని ద‌ర్శ‌కురాలు జీవిత అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేది వెల్ల‌డించ‌నున్నారు.

Related posts