బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ‘గుడ్ బై సుశాంత్’ అంటూ ఆయన కుటుంబ సభ్యులు అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా సినిమా, సైన్స్, స్పోర్ట్స్ తదితర రంగాల్లో ప్రతిభచాటే యువతకు ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. అంతేగాక బీహార్‌లోని పాట్నాలో ఉన్న సుశాంత్ చిన్ననాటి ఇంటిని ఆయన స్మారక చిహ్నంగా మార్చనున్నట్లు ఆ స్టేట్‌మెంట్ ద్వారా వెల్లడించారు. సుశాంత్ వ్యక్తిగత వస్తువులతో పాటు ఆయన చదివిన పుస్తకాలు మొదలైనవి ఆ ఇంటిలో ఉంచనున్నామని తెలిపారు. అలాగే సుశాంత్ సోషల్ మీడియా ఖాతాలైన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలను కూడా తామే నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సుశాంత్ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలనే ఆలోచనతో ఈ ఖాతాలను నిర్వహించనున్నామని చెప్పారు. దీంతో సుశాంత్ ఫ్యామిలీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు. ఈ నెల 14న తన ఇంట్లోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినపుడు ఆయన ఇంట్లో సూసైడ్ నోట్ లభించకపోవడం, పైగా ఎలాంటి ఆధారాలు కూడా దొరకకపోవడంతో ఈ ఇష్యూ ఎన్నో చర్చలను లేవనెత్తింది. సుశాంత్ డెత్ మిస్టరీపై ఎన్నో వార్తలు వచ్చాయి.
Official Statement from #SushantSinghRajput’s family #RIPSushantSinghRajput pic.twitter.com/BnBSDKrcMb
— Vamsi Kaka (@vamsikaka) June 27, 2020
లవ్ లో పడితే ఏం చేస్తావు ? అన్నారు… “బిగ్ బాస్”పై మాధవీలత సంచలనం