telugu navyamedia
సినిమా వార్తలు

న‌టుడుగా ద‌ర్శ‌క మౌన‌ముని..!

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నటుడిగా మారారు. వందకిపైగా చిత్రాలకు ‘స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌’ అని చెప్పిన ఆయన తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. శ్రీకాంత్ కుమారుడు రోహ‌న్ న‌టిస్తున్న ‘పెళ్లి సందడి’ సినిమాలో ఆయ‌న తొలిసారిగా వెండితెరపై కనిపించబోతున్నారు.

రాఘవేంద్రరావు దర్శకత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరీ రోనంకి ‘పెళ్లి సందడి’ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా న‌టిస్తున్నాడు ..శ్రీ లీల హీరోయిన్ న‌టిస్తుంది.. ఈ చిత్రంలోనే దర్శకేంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నారని స‌మాచారం. వశిష్టగా సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని సోష‌ల్ మీడియా వేదికగా తెలియజేస్తూ రాఘవేంద్రరావు పాత్రకి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి. ‘సుమారు 100కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన మన మౌనముని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు’ అని పేర్కొన్నారు.

సూట్‌ ధరించి, కళ్లజోడు పెట్టుకుని, బాస్కెట్‌ బాల్‌ పట్టుకుని స్టైలిష్‌లుక్‌లో దర్శనమిచ్చారు రాఘవేంద్రరావు. ఆయనతోపాటు రాజేంద్ర ప్రసాద్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రోషన్‌ ఈ వీడియోలో కనిపించారు.

Related posts