telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అల్లుఅర్జున్-మహేష్ చిత్రాల మధ్య కథే … పోటీ.. వారిమధ్య కాదు.. : త్రివిక్రమ్

Trivikram

త్రివిక్రమ్, మహేష్ మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఆసాన్నిహిత్యంతోనే మహేష్ తో రెండుసినిమాలు చేసాడు. అయితే మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుంది అంటూ గతకొంతకాలంగా వార్తలు వస్తున్నా రకరకాల కారణాలతో ఆమూవీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడం లేదు. ఇలాంటి పరిస్థితులలో తనకు సన్నిహితంగా ఉండే మహేష్ మూవీతోనే త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ పోటీ పడుతూ ఉండటం యాధృశ్చికం. రేపు విడుదల కాబోతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి అదేవిధంగా తన సినిమాల గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. కెరియర్ ప్రారంభంలో ఎవరికైనా ప్రశంసలు పొందాలి అని ఉంటుందనీ అయితే ఆతరువాత ఆప్రశంసలు అంచనాలకు మించిపోవడంతో వాటిని నిలబెట్టుకోవడం ఎలా అన్న టెన్షన్ ప్రతి సెలెబ్రెటీకి ఉంటుంది అంటూ కామెంట్ చేసాడు. ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ నుండి తాను భయాలతో పోరాటం చేయడం మొదలుపెట్టానని ఆతరువాత తీసిన ‘అరవింద సమేత’ సక్సస్ అయినా తన భయాలు తగ్గడం లేదు అంటూ తనపై తానే జోక్ చేసుకున్నాడు.

‘అరవింద సమేత’ తరువాత మళ్ళీ తాను అలాంటి కథతో సినిమా చేయకూడదు అని నిశ్చయించుకుని ధనవంతుల విశాలమైన ఇళ్ళల్లో వారి మనసులు ఎంత ఇరుకుగా ఉంటాయో తెలియచెప్పడానికి ఒక వ్యక్తికి స్థానం కల్పించవచ్చు కాని స్థాయిని కల్పించలేము అనే రెండు విషయాలను సింపుల్ గా చెప్పడానికి తాను ‘అల వైకుంఠపురములో’ మూవీని తీసిన విషయాన్ని వివరించాడు. చాలామంది తన ‘అల వైకుంఠపురములో’ కు ‘సరిలేరు నీకెవ్వరు’ కు పోటీ అంటూ వార్తలు రాస్తున్నారని ఈరెండు సినిమాల కథలు వేరువేరు అంటూ దీనితో ఈ రెండు సినిమాల మధ్య అసలు పోటీయే ఉండదు అంటూ తనఅభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఎంతటి గొప్ప రచయిత అయినా రామాయణ మహాభారతాలు దాటిన మంచి కథలు రాయలేరనీ అంటూ మనం వ్రాసే ప్రతి కథలోనూ కొత్తదనం ఉందనీ ఎదో ఒక ఛాయలో మరొక కథ స్ఫూర్తి కనిపిస్తుంది అంటూ ఈమధ్య తన పై వస్తున్న కాపీ రూమర్స్ కు సమాధానం ఇచ్చాడు. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ సాధారణ జనం సెలెబ్రెటీలను అభిమానించేది వారి పనితీరు గురించి మాత్రమే అంటూ ఆపనితీరు ప్రేక్షకులను మెప్పించలేకపోతే ఎలాంటి గొప్ప సెలెబ్రెటీలను అయినా ప్రేక్షకులు తిరస్కరిస్తారు అంటూ సాధారణ ప్రేక్షకుల నిర్ణయం ఫైనల్ అంటూ త్రివిక్రమ్ తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించాడు.

Related posts