విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్’. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం టర్కీలో తెరకెక్కిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చారు. ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానరుపై రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా తమన్నా నటిస్తోంది. ఐశ్వర్యాలక్ష్మి, యోగిబాబులు ఇతర తారాగణం. ఫుల్ ప్యాకేజీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సుందర్.సి దర్శకత్వంలో ‘వందా రాజావాదాన్ వరువేన్’ చిత్రం విడుదలై ఆశించిన విజయాన్ని సాధించలేక పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా పెద్ద హిట్‌ను సొంతం చేసుకోవాలని సుందర్.సి ప్రయత్నిస్తున్నారు. విశాల్, సుందర్.సి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. తాజాగా “యాక్షన్” తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో విశాల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు అర్థమవుతోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post