telugu navyamedia
రాజకీయ

బ్రేక్ ప‌డింది.. ఈటెల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త !

హుజూరాబాద్‌లో ప్ర‌జాదివేన యాత్ర‌లో మంత్రి ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డంతో మెరుగైన‌ వైద్యం కోసం ఈటలను హైదరాబాద్ కు తరలించాల‌ని డాక్టర్స్ సలహా ఇవ్వ‌డం హైదరాబాద్ కి తరలించారు. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, మెరుగైన వైద్యం కోస‌మే హైద‌రాబాద్ తీసుకెళ్ళిన‌ట్లు తెలుస్తుంది.

కాగా గత పది రోజులుగా పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్ స్వల్ప ఆస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు వీణవంక మండలం కొండపాక వరకు పాదయాత్ర చేసిన ఆయన జ్వరంతో భాదపడుతూ, న‌డ‌వ‌లేని స్థితిలో ఉండ‌టంతో పాద‌యాత్ర నిలిప‌వేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఎన్నికల నేపథ్యంలోనే ఆయన ఈ నెల 19న పాదయాత్రను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతి రోజు సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ… మొత్తం 23 రోజుల పాటు నియోజకవర్గంలోని 120పైగా గ్రామాల్లో చేసేందుకు ఆయన ప్లాన్ చేశారు.అయితే ఆయన పాదయాత్రను కొనసాగిస్తారా లేక బ్రేక్ వేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.

Related posts