హీరోయిన్ రాశీ ఖన్నా ఊహాలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ రేంజ్‌కి వెళ్లింది. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉన్న రాశీ ఖన్నా ఈ మధ్య సన్నగా, నాజూకుగా తయారైంది. ఒక్కసారిగా రాశీని చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అయ్యారు. ప్రస్తుతం వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవ్, సైతాన్ కా బచ్చా అనే సినిమాలు చేస్తుంది. రాశీ ఖన్నా నటించిన `పత్రిరోజూ పండగే`, `వెంకీ మామ` సినిమాలు వారం రోజుల గ్యాప్‌లో విడుదల కాబోతున్నాయి. `వెంకీ మామ` సినిమాలో నాగచైతన్యకు జోడీగా రాశి నటించింది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా రకుల్‌ను అనుకున్నారట. ఆ తర్వాత రాశిని తీసుకున్నారట. ఈ సినిమాలో పాత్ర గురించి రాశి తాజాగా మాట్లాడింది. “ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. వెంకీ సర్ లాంటి సీనియర్ హీరోతో నటించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ముందుగా రకుల్‌కు వచ్చింది. ఆమెకు డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో నేను చేశాను. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్” అని రాశి చెప్పింది.
previous post
‘ఉప్పెన’ చిత్రంపై సేతుపతి కామెంట్స్ …