telugu navyamedia
సినిమా వార్తలు

శాకుంతలం ఫస్ట్ లుక్.. దేవకన్యగా సమంత

 స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందిస్తోన్నసినిమా ‘శాకుంత‌లం’. ఈ సినిమాను మహాభారతంలో దుష్యంతుడు, శ‌కుంత‌ల మ‌ధ్య ప్రేమ‌..శాప‌వ‌శాత్తు వారు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం వంటి అంశాల‌తో ఈ సినిమాను అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ఆవిష్క‌రిస్తున్నారు గుణ‌శేఖ‌ర్

ఇప్ప‌టికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సమంత దేవకన్యలా ఉంది. ఈ ఫ‌స్ట్ లుక్‌లో స‌మంత‌ క‌న్య పాత్ర‌లో ఆశ్ర‌మంలో కూర్చుని ఉండ‌గా.. ఆమె చుట్టూ నెమ‌ళ్లు, జింక‌లు, హంస‌లు నిలుచుని ఉన్నాయి. ఆమె దేని కోస‌మే ఎదురు చూస్తోంది. ఫ‌స్ట్ లుక్ అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది.

శాకుంత‌లం చిత్రంలో యువ భరతుడిగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ న‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే దుష్యంత మ‌హారాజుగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతఅందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Related posts