telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జుహీ చావ్లా రొమాంటిక్ సీన్లపై ఆమె పిల్లల రియాక్షన్… !!

Juhi-Chawla

ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ జుహీ చావ్లా. బాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించి గ్లామరస్ హీరోయిన్‌గా క్రేజ్ కొట్టేసింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె హిందీతో పాటు పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లోనూ నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆమె తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల పట్ల పిల్లల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పుకొచ్చింది. తన పిల్లలు జాహ్నవి, అర్జున్ తాను నటించిన సినిమాలు చూడడానికి ఇబ్బందిపడతారని చెబుతూ ఓపెన్ అయింది జుహీ చావ్లా. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో తాను చేసిన సినిమాలు చూడటానికి వాళ్లు ఇష్టపడరని, వాటిలో తాను నటించిన రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ సినిమాలను చూడరని చెప్పింది. ఒకవేళ ఏదైనా సినిమా చూడాలనుకున్నా.. ముందుగానే ‘అమ్మా ఆ మూవీలో ఏమైనా రొమాంటిక్ సీన్లు ఉంటాయా’ అని అడుగుతారని చెప్పింది. అమ్మా నిన్ను రొమాంటిక్ సీన్లలో చూడడం నాకు నచ్చదని కొడుకు అర్జున్ అంటుంటాడని జుహీ చావ్లా చెప్పుకొచ్చింది.

Related posts