telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భవిష్యత్తులో నన్ను ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటున్నారు… ఫ్యాన్స్ కు రష్మిక ప్రశ్న

Rashmika

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రష్మిక మందన్న సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సరిపోయే ఓ కొత్త పేరును సూచించాలని ఇటీవల రష్మిక ట్విటర్ ద్వారా కోరింది. తాజాగా “భవిష్యత్తులో నన్ను ఎలాంటి సినిమాల్లో, పాత్రల్లో చూడాలనుకుంటున్నారు. చాలా ఆతృతగా ఉన్నా. త్వరగా సమాధానాలు చెప్పండి” అని రష్మిక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ‘డియర్ కామ్రేడ్’లోని లిల్లీ, ‘గీతగోవిందం’లోని ‘గీత’ వంటి పాత్రలు మరొకసారి చేయాలని కొందరు కోరారు. అలాగే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలోని సమంత పాత్ర చాలా చిలిపిగా ఉంటుందని, అలాంటి పాత్ర చేయమని మరొకరు సూచించారు. ‘రాజీ’ సినిమాలోని ఆలియా భట్ పాత్రలాంటిది చేయాలని మరొకరు సమాధానమిచ్చారు. హారర్ సినిమాలు చేయమని కొందరు కోరారు. ఇక ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ రష్మిక.

Related posts