telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళికి సిద్ధమైన యంగ్ డైరెక్టర్ సుజీత్

Sujeeth

‘రన్ రాజా రన్‌’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ సుజీత్… ఆ తర్వాత ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ ‘సాహో’ రూపొందించి ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను సుజిత్‌కే అప్పగించారు. త్వరలో ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రవళ్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించారని సమాచారం. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి ప్రవల్లిక వృత్తిరీత్యా డాక్టర్ అని తెలుస్తోంది. ఈ నెల పదో తేదీన ఎంగేజ్మెంట్ అని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లికి సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ పెళ్లి చేసుకోగా, తాజాగా అదేబాటలో అడుగులు వేస్తున్నారు యంగ్ డైరెక్టర్ సుజీత్.

Related posts