telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలా హరీష్ శంకర్ హిట్ కొడితే ఇండస్ట్రీ వదిలేస్తా… బండ్ల గణేష్ ఫైర్

bandla ganesh in bigg boss 3 conditions apply

గబ్బర్ సింగ్ దర్శక నిర్మాతలు హరీష్ శంకర్, బండ్ల గణేష్‌ల మధ్య వివాదం ముదిరింది. ఈ సినిమా 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ నోట్ విడుదల చేశారు. ఇందులో ఇందులో ఒక్క బండ్ల గణేష్ మినహా.. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు హరీష్ శంకర్. దీంతో బండ్ల గణేష్ స్పందిస్తూ.. “అదీ హరీష్ శంకర్ సంస్కారం.. అతన్ని పవన్ కళ్యాణ్‌కి పరిచయం చేసి సినిమా అవకాశం ఇప్పించింది నేను.. ఎన్టీఆర్‌తో సినిమా మిస్ అయ్యి డిప్రెషన్‌లో ఉంటే.. నేను పిలిచి సినిమా ఇచ్చా.. ఆయన గబ్బర్ సింగ్ లాంటి హిట్ వచ్చిందంటే ఎవరివల్లో మరిచిపోయారు. ఆయన సంస్కారం గురించి ఇంతకంటే ఏం మాట్లాడగలం. అయినా హరీష్ శంకర్ రీమేక్ దర్శకుడు. ఆయన రీమేక్ చిత్రాలు తప్ప సొంతంగా స్ట్రయిట్ సినిమా తీయలేరు. ఆయన్ని స్ట్రయిట్ సినిమా తీసి హిట్ కొడితే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళిపోతా. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ కళ్యాణ్ సలహాలు చాలా ఉన్నాయి. అంత్యాక్షరి ఎపిసోడ్ పవన్ ఐడియానే. హీరోయిన్ శృతి హాసన్ ఎంపిక కూడా పవన్ కళ్యాణ్‌దే. అయితే హరీష్ శంకర్ మేం అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా కంప్లీట్ చేశారు. ఈ సినిమా అప్పుడు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. అలాంటివే ఉంటే సినిమా పూర్తయ్యేది కాదు. ఆయన గురించి నేను చేసిన కామెంట్స్‌కి కట్టుబడే ఉన్నా.. రాస్తే రాసుకోండి.. నేను హరీష్ శంకర్‌ని ఇలా అన్నట్టు. నేను ఎవరికీ భయపడను. నా మాట అంటే మాటే” అంటూ ఫైర్ అయ్యారు బండ్ల గణేష్.

Related posts