telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్కినేని ఫ్యామిలిలో కోడళ్ళకు కుకింగ్ రాదట…

nag-chitu

కుటుంబ సభ్యుల కోసం సమంత ఇప్పటివరకు వంట చేయలేదట. అసలు తనకు వంట రాదట. ఈ విషయాన్ని స్వయంగా సమంత అత్తగారు అమల చెప్పారు. తాజా ఇంటర్వూలో అమల.. నాగ్ మంచి కుక్ అని కితాబిచ్చారు. ఈ విష‌యం ఆమే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇక త‌మ కోడ‌లు స‌మంత అస్స‌లు వంటచేయ‌ద‌ని తేల్చేశారు. ఇక నాగ్ లాగానే.. చైత‌న్య కూడా మంచి కుక్ అన్న సంగ‌తి స్పెష‌ల్ గా చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌నికి వంట చేయ‌డం హాబీ కూడా. స‌మంత..భ‌ర్త చేసిన వంట‌ల‌ను టేస్ట్ చేసి రేటింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ విష‌యాన్ని స‌మంత ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. వంట వచ్చిన నాగ్, చైతులు దొరకడం అమల, సమంతల అదృష్టం అంటున్నారు అభిమానులు.

Related posts