telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హిమాలయాల్లో విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్న కంగనా సోదరి

Kangana

బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ తన సోదరి రంగోలి చందేల్‌ హిమాలయాల్లో నిర్మించుకున్న విలాసవంతమైన ఇల్లు కంగనా రనౌత్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కంగనా సోదరి రంగోలీ చందేల్ హిమాలయ పర్వతాల్లో కొత్తగా నిర్మించుకున్న విలాసవంతమైన ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. అత్యంత విలాసవంతంగా మంచు పర్వతాల్లో నిర్మించిన ఇంటికి రంగోలీ ‘విల్లా పెగాసుస్’ అని పేరు పెట్టారు. విల్లా పెగాసుస్ అంటే గ్రీకు భాషలో రెక్కల గుర్రం అని అర్థం. రంగోలీ అజయ్‌ను వివాహమాడాక తమ జీవితాన్ని ముంబైలోని ఓ అపార్టుమెంటులో ప్రారంభించారు. వారికి పృథ్వీ అనే కుమారుడు జన్మించాడు. దీంతో రంగోలీ హిమాలయాల్లో తమ కలల సౌధాన్ని నిర్మించారు. తన కొత్త ఇంటి అందాలను తన సోదరి కంగనా దగ్గరుండి స్థానికంగా లభించిన మెటీరియల్స్ తో తీర్చిదిద్దారని రంగోలీ చెప్పారు. సోదరి కంగనతో కలిసి నూతన గృహప్రవేశం చేసిన రంగోలీ సంప్రదాయబద్ధంగా హారతి పూజ చేసి హల్వా వండారు. హిమాలయాల్లో నిర్మించుకున్న విలాసవంతమైన కొత్త ఇంటి చిత్రాలను రంగోలీ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు. హిమాలయ పర్వతాల చెంత ఉన్న కొత్త ఇల్లు, డ్రాయింగ్ రూం, హాలు, వరండా ఫొటోలను రంగోలీ సోషల్ మీడియాలో పెట్టారు.

Related posts