telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి దిల్ రాజు బ్యానర్ లో .. రాజ్ తరుణ్.. !

rajtarun with dil raju again

యువ నటులలో తనదైన శైలిలో నటిస్తూ, వరుస అవకాశాలతో .. వరుస విజయాలతో దూసుకొచ్చిన అతి కొద్దీ మందిలో రాజ్ తరుణ్ ఒకరు. అయితే క్రితం ఏడాది ఆయనను వరుస పరాజయాలు పలకరించాయి. దానితో సహజంగానే అవకాశాలు తగ్గాయి. అయినా కూడా మళ్లీ దిల్ రాజు ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.

రాజ్ తరుణ్ ఇంతకుముందు దిల్ రాజు బ్యానర్లో ‘లవర్’ తో పరాజయాన్ని చవిచూసినా, మళ్లీ అదే బ్యానర్లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణారెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి ‘నీది నాది ఒకటే లోకం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ ఉన్నాడు.

Related posts