telugu navyamedia
సినిమా వార్తలు

‘ప్రాజెక్ట్‌ కె’: ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ప్రాజెక్ట్‌ K’. ఈ సినిమాలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ..అమితాబ్‌ బచ్చన్ ఓ ప్ర‌తే్య‌క‌ పాత్ర చేస్తున్నారు.

Project K's big update on the way? - TeluguBulletin.com

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్‌డేట్స్ ఇచ్చారు చిత్ర నిర్మాత సి అశ్వనీ దత్. ‘ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని.. పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ షెడ్యూల్‌లో అమితాబ్, దీపికా పాల్గొనబోతున్నారని తెలిపారు.

Prabhas producer Aswini Dutt claims Rs 210 Cr compensation

ఇక ఈ చిత్రానికి ప్రముఖ సీనియర్ దర్శకులు సంగీతం శ్రీనివాస్ క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకూలంగా ఉంటే ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అశ్వనీదత్ వెల్ల‌డించారు.

Related posts