telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరుణ్‌ తేజ్‌ “గని” లో కన్నడ హీరో!

మెగా హీరో వరుణ్ తేజ్ తన మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు పొండాదు. ఆ తర్వాత తొలిప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ వంటి హిట్లు అందుకుని కొత్త సినిమాలతో చెలరేగుతున్నాడు. ఇప్పుడు తాజాగా తన నూతన చిత్రం కోసం బాక్సర్‌గా మారాడు. వరుణ్ తేజ్ పదవ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో వస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్లను నేడు విడుదల చేసారు. ”గని” పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో పాత్ర కోసం వరుణ్ తేజ్ బాక్సర్ ఫిజిక్ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో పంచింగ్ బ్యాగ్‌పై ప్రాక్టీస్ చేస్తూ పవర్ ఫుల్ పంచ్ కొడుతున్నాడు.  అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. వరుణ్‌ తండ్రి పాత్రలో ఉపేంద్ర నటించబోతున్నట్లు టాక్‌. పాత్ర గురించి వివరించగానే ఉపేంద్ర సంతోషంగా అంగీకరించారట. ఫిబ్రవరి 12న ఉపేంద్ర ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది.

Related posts