telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

క్లైమాక్స్ కు చేరుకున్న శ్యామ్ సింగరాయ్…

Vijay Shyam Singa Rai

ప్రస్తుతం మన తెలుగు హీరోలు ఒక్కేసారి రెండు మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. అందులో నాచురల్ స్టార్ నాని కూడా ఉంటాడు. అయితే ప్రస్తుతం ఈ నాచురల్ స్టార్ చేస్తున్న సినిమాల్లో శ్యామ్ సింగరాయ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈ సినిమా పాన్‌ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారని ఈ మధ్య వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ సినిమా గతజన్మలకు సంబంధించిన కథ అని కొందరు, సోషియో ఫాంటసీ అని మరికొందరు అంటున్నారు. అయితే ఈ సినిమా అసలు కథ ఏంటి అనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ సివారులోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నరట. అంతేకాకుండా సినిమా క్లైమాక్స్ సన్నివేవాలను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులోని సినిమాలోని కీలక నటీనటులు పాల్గొననున్నారట. క్లైమాక్స్ ఇప్పటికే చిత్రీకరించనా కూడా కొన్ని కారణాల కారణంగా రీషూట్ చేస్తున్నారట. ఇందు కోసమని అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున కోల్‌కతా సెట్‌ వేశారట. ఇదిలా ఉంటే శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోందట. భారీ కాస్టింగ్, సెట్టింగ్‌లతో సినిమా తెరకెక్కిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts